ePaper
More
    HomeతెలంగాణTraffic Police | ఒకే బైక్​పై 8 మంది యువకుల హల్​చల్​.. ఆ తర్వాత ఏం...

    Traffic Police | ఒకే బైక్​పై 8 మంది యువకుల హల్​చల్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Police | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా పలువురు ట్రాఫిక్​ నిబంధనలు(Traffic Rules) పాటించడం లేదు. ముఖ్యంగా కొందరు యువకులు రోడ్డుపై ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారు. బైక్​లు, కార్లతో స్టంట్లు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఇలాగే ఒకే వాహనంపై ఎనిమిది మంది యువకులు రోడ్డుపై వెళ్తూ హల్​చల్​ చేయగా.. వారికి పోలీసులు షాక్​ ఇచ్చారు.

    రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లోని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Rajendranagar Traffic Police Station) పరిధిలోని గగన్‌పహాడ్ సమీపంలో ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వెళ్లారు. వెనకాల వెళ్తున్న ఓ వ్యక్తి వారిని వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్​గా మారింది. దీంతో పోలీసులు స్పందించారు. దర్యాప్తు చేపట్టి బైక్​పై వెళ్లిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఆ ఎనిమిది మందిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. ఒకే బైక్​పై ఎనిమిది మంది వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    View this post on Instagram

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...