HomeUncategorized8 Vasanthalu | 8 వసంతాలు మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టినట్టేనా?

8 Vasanthalu | 8 వసంతాలు మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టినట్టేనా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: 8 Vasanthalu | అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)బ్యానర్ లో మ్యాడ్ మూవీ ఫేమ్ ‘అనంతిక సనిల్ కుమార్'(Anathika Sanilkumar)టైటిల్ రోల్ పోషించిన చిత్రం 8 వ‌సంతాలు. ప్ర‌చార చిత్రాల‌తో ఈ మూవీకి మంచి ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఈ మూవీ నేడు విడుద‌ల కాగా, ఎలా ఉందో చూద్దాం.

8 Vasanthalu | క‌థ‌:

శుద్ధి అయోధ్య (అనంతిక) యువ ర‌చ‌యిత్రి. ఆమెకి త‌న‌ పని పట్ల అకింత భావం, ఏదైనా సాధించగల పట్టుదల, కొండంత ధైర్యం, అంతులేని సాహసం ఉంటుంది. త‌న‌ రచనలే కాదు.. బరిలోకి దిగితే ఎవరినైనా కింద పడగొట్టగల యోధురాలు కూడా. మార్షల్ ఆర్ట్స్(Martial Arts), బ్లాక్ బెల్ట్‌(Black Belt)లో శుద్ధి ఆరి తేరిన వ్యక్తి. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తంతో శుద్ధి గొప్ప రచయితగా మారుతుంది. ఆమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వచ్చి దారి మారేలా చేస్తాడు. శుద్ధి అయోధ్య ప్రేమించే సరికి ఆమె హృదయాన్ని విరిచేసి విదేశాలకు వెళతాడు. ఆ హార్ట్ బ్రేక్ నుంచి కోలుకుని మరో పుస్తకం రాసిన ఆమెకు.. ఊటీలో తెలుగు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు. ఆ త‌ర్వాత‌ వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని నడి రోడ్డున వదిలేసి వెళ్తాడు.. ఈ లోపు శుద్ధి వాళ్ల అమ్మ వేరే పెళ్లి సంబంధం చూస్తే శుద్ధి అందుకు ఒప్పుకుంటుంది. కానీ శుద్ధికి తెలియని విషయం ఏంటంటే శుద్ధి ‘ 8 వసంతాల’లో సంజయ్ పాత్ర ఉంటుంది. అయితే 8 వసంతాల్లో జరిగిన మార్పులు ఏంటి? ఈ కథలో శుద్ధి స్నేహితులు కార్తిక్, అనిత పాత్రలు ఏంటి? అన్నది కథ.

8 Vasanthalu | న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

శుద్ధి అయోధ్య క్యారెక్టర్ లో అనంతిక(Heroine Ananthika) పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. ఆమె గురించి ఎంత మాట్లాడుకున్నా త‌క్కువే. అభిమానాన్ని పంచే స్నేహితురాలిగా, ప్రేమ కోసం పరితపించే ప్రేమికురాలుగా, ఆ ప్రేమ తనకి దక్కనప్పుడు, బాధని దిగమింగుకుంటూ, మనో ధైర్యాన్ని తెచ్చుకునే సగటు అమ్మాయిలా, తల్లి చాటు బిడ్డలా, మార్షల్ ఆర్ట్స్ ద్వారా చెడుని ఎదుర్కొనే డేరింగ్ ఉన్న అమ్మాయిలా, ర‌చ‌యిత్రిగా ఇలా అన్ని వేరియేషన్స్‌లో శుద్ది అద‌ర‌గొట్టేసింది. హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసునూరి, సంజనా హార్ద గేరి కూడా ఎంతో అనుభవమున్న వాళ్ళల్లా నటించి అల‌రించారు. ఎవ‌రికి వారు త‌మ త‌మ పాత్రల‌లో అద్భుతంగా న‌టించి అద‌ర‌హో అనిపించారు.

8 Vasanthalu | టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్..

సినిమాకి టెక్నీషియన్లే ప్రధాన బలం. మ్యూజిక్‌ సినిమాకి మెయిన్ పిల్ల‌ర్‌గా నిలిచింది. సాంగ్స్ అన్నీ అలరించేలా ఉన్నాయి. అదే సమయంలో బిజీఎంతో కూడా సన్నివేశాలకు ప్రాణం పోశారు. లవ్ లోని ఎమోషన్‌ని ప్రతిబింబించే సీన్లలో ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. ఇక డీవోపీ విశ్వనాథ్‌ రెడ్డి సినిమాను ఒక విజువల్‌ ఫీస్ట్ లా తయారు చేశారు. ఆయన ప్రతి ఫ్రేమ్‌ వండర్‌గా అనిపిస్తుంది. లాంగ్‌ షాట్‌లు చూపించిన తీరు, గ్రీనరీని ఆవిష్కరించిన తీరు ఎంతో బాగుంది. కెమెరాతోనే తన కథని చెప్పాడు. ఎడిటర్‌ శశాంక్‌ మాలి కొంత ఎడిటింగ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి(Director Phanindra Narsetti) సినిమాను తీసిన తీరు బాగుంది. డైలాగ్‌లను చాలా బాగా రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు పెట్టారు.

ప్ల‌స్ పాయింట్స్:

కొన్ని సీన్స్
మ్యూజిక్
డైలాగ్స్
అనంతిక న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:

రిపీటెడ్ సీన్స్
ఎక్కువైన డైలాగ్స్

8 Vasanthalu | విశ్లేష‌ణ‌:

ద‌ర్శ‌కుడు ఫణింద్ర (Phanindra) దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనపడింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. రచయితగా మాత్రం సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు. సినిమాలో వారణాసి ఫైట్ గురించి ఫణీంద్ర నర్సెట్టి గొప్పగా చెప్పారు. నిజానికి, ఈ కథ / సినిమాకు ఆ ఫైట్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే… కమర్షియల్ సినిమాలు కొన్నిటిలో ఆ తరహా ఫైట్స్ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా చేసిందేమీ లేదు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక డైలాగ్‌ గుండెని గుచ్చేస్తుంది. మనసుని కదిలిస్తుంది. ఆలోచింప జేస్తుంది. వాస్తవ ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. సినిమా మెయిన్‌ గా శుద్ధి పాత్ర ప్రధానంగా సాగుతుంది. వివిధ స్టేజ్‌లోని ఆమె లైఫ్‌ని చూపించడం విశేషం. అయితే ఆడియెన్స్‌కి ఇలాంటి ఓ డెప్త్, ఇంటెన్స్ లవ్ స్టోరీలు ఎక్కువతాయా? ఇప్పుడున్న ట్రెండ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపిస్తుందా? అంటే చెప్పలేం. అందరికీ ఈ 8 వసంతాలు అంత గొప్పగా అనిపించకపోవచ్చు.. కానీ కొందరికి మాత్రం క‌నెక్ట్ అవుతుంది.

సినిమా పేరు: 8 వసంతాలు
తారాగణం: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసునూరి, సంజనా హార్ద గేరి తదితరులు
సంగీతం: హేషం అబ్దుల్ వాహబ్
డీఓపీ: విశ్వనాధ్ రెడ్డి
ఎడిటర్: శశాంక్ మాలి
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
బ్యానర్ :మైత్రి మూవీ మేకర్స్

రేటింగ్ 2.5/5