HomeUncategorized8 Vasantalu trailer | మ‌న‌సుకి హ‌త్తుకునేలా ఉన్న 8 వసంతాలు ట్రైల‌ర్.. డైలాగ్స్ సూప‌ర్బ్​

8 Vasantalu trailer | మ‌న‌సుకి హ‌త్తుకునేలా ఉన్న 8 వసంతాలు ట్రైల‌ర్.. డైలాగ్స్ సూప‌ర్బ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : 8 Vasantalu trailer | ఇటీవ‌లి కాలంలో వ‌చ్చే కొన్ని చిత్రాలు అందులోని సంభాష‌న‌లు మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఉంటున్నాయి. మధురం షార్ట్ ఫిల్మ్‌కి ఉన్న క్రేజ్, స్టార్ డం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రతీ ఒక్కరూ ఆ షార్ట్ ఫిల్మ్‌ను చూసి ఆనందించి, ఆస్వాధించి, బాధ పడి ఉంటారు. మళ్లీ అలాంటి ఓ స్వచ్చమైన ప్రేమ కథతో 8 వసంతాలు (8 vasantalu) అంటూ డైరెక్టర్ ఫణీంద్ర రాబోతోన్నారు. జూన్ 20న రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఇందులో ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్‌లా ఉంది. ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్, పాటల్ని గమనిస్తే సినిమా థీమ్, స్టోరీ, పాయింట్ ఏంటో అర్థం అవుతుంది.

8 Vasantalu trailer | చాలా డెప్త్‌తో..

ఇంత వరకు వచ్చిన ప్రేమ కథల్లో ఎక్కువగా మగాడి కోణం నుంచే చూపించారు. అయితే ఈ ‘8 వసంతాలు’ మాత్రం పూర్తిగా ఓ అమ్మాయి ప్రయాణం.. అమ్మాయి ప్రేమ కథ.. అమ్మాయి వేదన, బాధను చూపించినట్టుగా అర్ధ‌మ‌వుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో విజువల్స్, బీజీఎం BGM మనసుని తాకినట్టుగా ఉంటుంది. ఇక ఇందులోని డైలాగ్స్ మాత్రం నేరుగా గుండెల్లో గుచ్చినట్టుగానే ఉన్నాయి. ‘చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. అంత్యక్రియలకు వాళ్లు పనికి రారు’.. ‘ఆడవాళ్లు పనికి రారా పేగు పంచి ప్రాణం పోయగలిగిన మేము.. చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా?’.. ‘నా ఆనందాన్ని, మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో కాకుండా మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాల్ని ఆస్వాధించడంలో వెతుక్కున్నా’.. ‘ప్రేమ.. జీవితంలో ఒక దశ మాత్రమే.. అదే దిశ కాదు’.. ‘మగాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్య నగరాలున్నాయి.. ఆడదాని ప్రేమకేమున్నాయి.. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్పా’.. అనే డైలాగ్స్ సినిమాలో ఎంత డెప్త్ ఉంద‌నేది చెప్ప‌క‌నే చెబుతుంది.

అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది ఓ షార్ట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ వస్తుంది. మరి థియేటర్లో ఈ మూవీని మన తెలుగు ఆడియెన్స్ (Telugu audience) ఎంత మేర‌కు ఆద‌రిస్తారో చూడాలి. మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌, న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రవితేజ దుగ్గిరాల (Raviteja Duggirala), హ‌ను రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించిన ఈ మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి