అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mandi Biryani | హైదరాబాద్ (Hyderabad) టోలిచౌకిలోని ప్రముఖ రెస్టారెంట్‌లో (Restaurant) కలుషితమైన ఆహారం తిని అస్వస్థతకి గురైన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది.
ఫుడ్ తిని అస్వస్థతకు గురైన వారిలో మొత్తం 8 మంది ఉండగా, ఇందులో నలుగురు విద్యార్థులు ఉన్నారు ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తీవ్ర వాంతులు, విరేచనాలతో బాధపడుతూ శనివారం ఉదయం నుండి ప్రైవేట్ ఆసుపత్రి, తర్వాత కోరెంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిషేధిత మయోన్నైస్ కలిగి ఉన్న కలుషిత ఆహారం తిన్న ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర ఆరోగ్య సమస్యలకు (health problems) లోనయినట్టు తెలుస్తుంది
Mandi Biryani | నాణ్యత లేని ఫుడ్..
సమాచారం ప్రకారం, శుక్రవారం రాత్రి ఖాలెద్ కుటుంబ సభ్యులు, అతని సోదరి కుటుంబ సభ్యులతో కలిసి టోలిచౌకి పోలీస్ స్టేషన్ (Tolichawki police station) పరిధిలోని పారామౌంట్ కాలనీలో ఉన్న “అల్‌వాది యెమిని” రెస్టారెంట్‌ను సందర్శించారు. అక్కడ వారు మండీ బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. ఆ సమయంలో వారికి రెస్టారెంట్ సిబ్బంది నిషేధిత మయోన్నైస్ కూడా అందించినట్లు తెలుస్తోంది.
దాంతో వారు అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. బాధితుల్లో నలుగురు విద్యార్థులు ఉండగా, వారిలో పదవ తరగతి విద్యార్థి అహ్మద్ బిన్ ఖాలెద్, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థి సయ్యద్ అఫ్నాన్, ఇంజనీరింగ్ విద్యార్థి మహ్మద్ బిన్ ఖాలెద్, ఏడవ తరగతి విద్యార్థి సయ్యద్ అద్నాన్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని లైబా ఫాతిమా ఉన్నారు.
శనివారం ఉదయం నుంచే వారందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలై ఆరోగ్యం విషమించింది. దాంతో వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించగా, పరిస్థితి తీవ్రమైనందున వారికి తర్వాత కోరెంటి ఆసుపత్రికి (Korenti Hospital) తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారు రెస్టారెంట్ యజమాని, తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం ఖాలెద్ రెస్టారెంట్ యజమానిపై ఫిర్యాదు చేసి టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటివరకు కలుషిత ఆహారం, నిషేధిత మయోన్నైస్ (Banned Mayonnaise) వాడకంపై విచారణ చేపట్టారు.