HomeUncategorizedMilitary Parade | యూఎస్ ఆర్మీ ప‌రేడ్‌పై దారుణ‌మైన ట్రోలింగ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న...

Military Parade | యూఎస్ ఆర్మీ ప‌రేడ్‌పై దారుణ‌మైన ట్రోలింగ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Military Parade | అమెరికా మిలిటరీ పరేడ్‌ 250వ వార్షిక వేడుకను వాషింగ్టన్‌లో జూన్‌ 14న (అమెరికా కాలమానం ప్రకారం) నిర్వహించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (US President Donald Trump) 79వ జన్మదిన సందర్భం కూడా దీనికి కలిసివచ్చింది. దీంతో ఈసారి పరేడ్‌ను పెద్ద ఎత్తున నిర్వహించింది అమెరికా ప్రభుత్వం (US government). ఈ పరేడ్‌కు ముఖ్య అతిథులుగా ప‌లువురు ప్ర‌ముఖుల‌ను కూడా ఆహ్వానించారు. అయితే అమెరికా ఆర్మీ (US Army) నిర్వహించిన పరేడ్ ఓ వివాదానికి దారితీసింది. పరేడ్ సందర్భంగా కొన్ని దృశ్యాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంతో, నెటిజన్లు ట్రోలింగ్‌కు తెరలేపారు. ముఖ్యంగా సైనికుల నడక, సెటప్, కొందరి హావభావాలను మీమ్స్ మాదిరిగా చేసి నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు.

Military Parade | దారుణ‌మైన ట్రోల్స్

సామాజిక మాధ్యమాల్లో ‘#ArmyParade’, ‘#MarchFails’ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది యూజర్లు ఈ పరేడ్‌ను ‘మార్చింగ్ లేదా మస్కరేడ్?’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే పరేడ్‌లో పాల్గొన్న సైనికుల కదలికలు, వారి మ‌ధ్య స‌రైన సమన్వయం లేకపోవడాన్ని కామెడీగా ఎడిట్ చేసిన వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే, ఈ ట్రోలింగ్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు “ఇది జాతీయ గౌరవాన్ని అపహాస్యం చేయడం” అని విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం దీనిని సరదా కోణంలో చూడడంలో త‌ప్పులేదు అంటూ అభిప్రాయపడుతున్నారు.

మ‌రోవైపు సైనిక కవాతు సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొద్దిసేపు క‌ళ్లు మూసుకున్నాడ‌ని, అందుకు సంబంధించిన పిక్ ఒక‌టి నెట్టింట తెగ వైర‌ల్ చేస్తున్నారు. అయితే సైనిక పరేడ్ (military parade) లాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌ కార్యక్రమాల్లో ఇలా ట్రోలింగ్‌కు తావిచ్చే ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని నెటిజన్లలో కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. ఈ వీడియోల ప్రభావంతో రానున్న రోజుల‌లో ప‌రేడ్ విష‌యంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Must Read
Related News