అక్షరటుడే, కామారెడ్డి : Gram Panchayat Elections | కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో పోలింగ్ దాదాపు 80శాతం పోలింగ్ నమోదైంది. పది మండలాల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 79.40 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,42,913 ఓటర్లకు మధ్యాహ్నం 1 గంటల వరకు 1,92,870 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Gram Panchayat Elections | భిక్కనూరు మండలంలో..
భిక్కనూర్ మండలం (Bikkanoor Mandal)లో 81.05 శాతం, బీబీపేటలో 83.65, దోమకొండ 75.62 , కామారెడ్డి 78.45, మాచారెడ్డి 78.19, పాల్వంచ 81.09, రాజంపేట 80.46, రామారెడ్డి 75.26, సదాశివనగర్ 78.81, తాడ్వాయి మండలంలో 80.63 శాతం పోలింగ్ నమోదైంది.
Gram Panchayat Elections | ఓటింగ్లో మహిళలదే పైచేయి
మొదటి విడత 10 మండలాల్లో మహిళల ఓట్లే అధికంగా ఉండగా ఎన్నికల పోలింగ్లో కూడా వారిదే పైచేయిగా మారింది. మొత్తం 2,42,913 మందిలో 1,92,870 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇందులో పురుషులు 88,642 మంది, స్త్రీలు 1,04,228 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే 15,586 మంది మహిళలు ఓటు వేశారు.
Gram Panchayat Elections | గజ్యానాయక్ తండాలో దొంగఓట్ల ఘర్షణ
మాచారెడ్డి మండలం (Machareddy Mandal) గజ్యానాయక్ తండాలో కాసేపు స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారని పుకార్లు వ్యాపించాయి. దుబాయి వెళ్లిన ఓవ్యక్తి ఓటును ఇతరులు వేస్తున్నారని ప్రచారం కాగా అక్కడ కాసేపు ఘర్షణ నెలకొంది. దాంతో పోలీసులు అక్కడ ఉన్నవారిని చెదరగొట్టారు. అయితే దుబాయి వెళ్లాడని పుకార్లు వచ్చిన వ్యక్తి తాను ఎక్కడికి వెళ్లలేదని..స్వయంగా ఆయనే ఓటు వేయడంతో వివాదం సర్దుమణిగింది.
Gram Panchayat Elections | ఫలితాలపై ఉత్కంఠ.. కొనసాగుతున్న కౌంటింగ్
మధ్యాహ్నం 1 గంటలకు పోలింగ్ ముగియగా లంచ్ విరామం తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. మొదట వార్డు స్థానాలకు కౌంటింగ్ చేపడుతున్నారు. చిన్న పంచాయతీల్లో సర్పంచ్ ఓటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 6-7 గంటల మధ్య మొత్తం 10 మండలాలలో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. మరోవైపు కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అనేక చోట్ల అభ్యర్థులు రూ.లక్షల్లో ఖర్చు చేయడంతో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.