56
అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) భాగంగా నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) మూడు విడతల్లో కలిపి 78.04 శాతం ఓట్లు పోలయ్యాయి.
మొదటి విడతలో 81.37 శాతం, రెండో విడతలో 76.71 శాతం, మూడో విడతలో 76.45 శాతం ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 7,88,356 మంది ఓటర్లు ఉండగా.. మూడు విడతల్లో కలిపి 6,15,257 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళలు 3,49,574 మంది, పురుషులు 2,65,679 మంది ఓట్లు వేశారు. కాగా.. జిల్లా వ్యాప్తంగా 545 సర్పంచ్ స్థానాలు, 5022 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.