అక్షరటుడే, ఇందూరు : Panchayat Elections | గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఆర్మూర్ డివిజన్లోని (Armoor Division) 12 మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) 23.35 శాతం ఓటింగ్ నమోదయింది. 11 గంటల వరకు 54.69 శాతం ఓట్లు వేశారు.
Panchayat Elections | మధ్యాహ్నం ఒంటి గంటకు..
మధ్యాహ్నం ఒకటి గంట వరకు 74.36 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే క్యూలైన్లో ఉన్న వారికి ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదయం చలి తీవ్రతతో మందకొడిగా సాగినప్పటికీ.. 9 గంటల తర్వాత ఓటింగ్ సరళి పుంజుకుంది. ఆలూరు మండలంలో (Aluru Mandal) 75.87 శాతం, ఆర్మూర్‌లో 74 శాతం, బాల్కొండలో 63.25 శాతం, భీమ్‌గల్ మండలంలో (Bheemgal Mandal) 73.18 శాతం, డొంకేశ్వర్ మండలంలో 77.39 శాతం, కమ్మర్‌పల్లిలో 72.85 శాతం, మెండోరాలో 76.29 శాతం, మోర్తాడ్‌లో 75.87 శాతం, ముప్కాల్ మండలంలో (Mupkal Mandal) 76.61 శాతం, నందిపేట్ మండలంలో 78.04, వేల్పూర్‌లో 75.01 శాతం, ఏర్గట్లలో 75.92 శాతం ఓటింగ్ నమోదయింది. మొత్తం 3,06795 మంది ఓటర్లకు గాను.. ఇప్పటివరకు 2,28,118 మంది ఓట్లు వేశారు.