అక్షరటుడే, వెబ్డెస్క్ : Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కొత్త సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 713 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ నెలకు సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం రూ.713 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు బుధవారం డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.713 కోట్ల బిల్లులను విడుదల చేశారు.
Govt Employees | హామీ మేరకు..
ఉద్యోగులకు గత కొంతకాలంగా బిల్లులు పేరుకుపోయాయి. ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్, అడ్వాన్సులకు సంబంధించిన బిల్లుల కోసం ఉద్యోగులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో జూన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ బిల్లులు (Pending Bills) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం జూన్లో రూ.183 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లపైనే విడుదల చేస్తోంది. నవంబర్లో రూ.707 కోట్లు విడుదల చేయగా.. తాజాగా రూ.713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన బకాయిలు సైతం త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.