అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smart Phones | కొత్త ఏడాది 2026లో అడుగుపెట్టిన వేళ, స్మార్ట్‌ఫోన్ ప్రేమికుల్లో ఒకే ప్రశ్న.. ఈసారి ఐఫోన్ తీసుకోవాలా? లేక ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ సరిపోతుందా? ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) 17 ప్రో విడుదలకు ముందే, మార్కెట్లో ఉన్న టాప్ ఆండ్రాయిడ్ ఫోన్లు ఫీచర్ల విషయంలో ఒక అడుగు ముందే ఉన్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
200MP హై-రిజల్యూషన్ కెమెరాలు, 8K వీడియో రికార్డింగ్, స్నాప్‌డ్రాగన్ (Snapdragon) 8 ఎలైట్ లేదా డైమెన్సిటీ 9500 వంటి పవర్ఫుల్ ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు, అత్యాధునిక LTPO AMOLED డిస్ప్లేలు… ఇలా చెప్పుకుంటూ పోతే ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లు యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో నిండిపోయాయి.
Smart Phones | ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ డామినేషన్
ఈసారి ప్రీమియం సెగ్మెంట్లో శాంసంగ్, గూగుల్, షావోమీ, ఒప్పో, వివో, వన్‌ప్లస్, రియల్‌మి బ్రాండ్లు ఐఫోన్ 17 ప్రోకు గట్టి సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్, కస్టమైజేషన్ విషయంలో ఆండ్రాయిడ్ ఫోన్లు (Android Phones) స్పష్టమైన ఆధిక్యం చూపిస్తున్నాయి.
Smart Phones | టాప్ ఫ్లాగ్షిప్ ఫోన్లు ఇవే..
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా
పెద్ద డిస్ప్లే, S పెన్ సపోర్ట్, 200MP క్వాడ్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్తో ఇది బిజినెస్ యూజర్లు, పవర్ యూజర్లకు బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో
ప్రీమియం డిజైన్, హాసెల్‌బ్లాడ్ ట్యూన్ 200MP పెరిస్కోప్ కెమెరా, భారీ 7500mAh బ్యాటరీతో ఫోటోగ్రఫీ ప్రేమికులను టార్గెట్ చేస్తోంది.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL
కెమెరా హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్వేర్ మ్యాజిక్కు పేరు గాంచిన పిక్సెల్ సిరీస్… కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ, క్లిన్ ఆండ్రాయిడ్ అనుభవం కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్.
వివో X300 ప్రో
Zeiss భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్, కెమెరా క్వాలిటీ విషయంలో ఐఫోన్‌ను నేరుగా టార్గెట్ చేస్తోంది. పెద్ద బ్యాటరీ, 8K వీడియో సపోర్ట్ ప్రత్యేక ఆకర్షణ.
వన్‌ప్లస్ 15
స్మూత్ సాఫ్ట్వేర్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫ్లాగ్షిప్. తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ ఇస్తుంది One Plus.
రియల్‌మి GT 8 ప్రో
హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీ, 200MP కెమెరాతో యంగ్ యూజర్లను ఆకట్టుకుంటోంది.
షావోమీ 15 అల్ట్రా
లైకా ట్యూన్ కెమెరాలు, ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ, పవర్ఫుల్ డిస్ప్లేతో కెమెరా ఎంథూసియాస్ట్లకు ఇది టాప్ ఛాయిస్.
ఐఫోన్ 17 ప్రో అవసరమా?
ఎకోసిస్టమ్, లాంగ్‌టర్మ్ స్టేబిలిటీ, ప్రైవసీ ముఖ్యం అనుకునే వారికి ఐఫోన్ ఇప్పటికీ ప్రత్యేకమే. కానీ ఫీచర్లు, కెమెరా వెర్సటిలిటీ, బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటి అంశాల్లో చూస్తే… 2026లో ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లు ఐఫోన్ 17 ప్రోకి గట్టి పోటీనే ఇస్తున్నాయన్నది స్పష్టమవుతోంది.