Police Vehicles | ఏంటి.. పోలీస్ వాహనాలపై రూ.68.67 లక్షల చలానాలా.. వారు క‌ట్టరా?

అక్షరటుడే, వెబ్​డెస్క్:Police Vehicles |బండి లేదా కారులో రోడ్డు మీద వెళుతున్నామంటే భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. ఎక్క‌డా ఏ ట్రాఫిక్ పోలీస్(Traffic Police) ఆపుతాడో అని. అన్ని స‌రిగా ఉన్నా కూడా ఏదో ఒకటి చెప్పి చ‌లానాలు విధిస్తున్నారంటూ వాహ‌నదారులు వాపోతున్నారు. కొంద‌రు చ‌లాన్లు(Challans) క‌ట్ట‌లేక బ‌స్సుల‌లో ప్ర‌యాణిస్తున్న ప‌రిస్థితి. ఈ మ‌ధ్య ట్రాఫిక్ రూల్స్ Traffic Rules మ‌రింత స్ట్రిక్ట్ కావ‌డంతో వాహ‌న‌దారుల‌లో గుబులు రేగుతుంది. అయితే సాధార‌ణంగా కొంద‌రు వాహ‌న‌దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించ‌క‌పోవ‌డంతో వారిపై […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Police Vehicles |బండి లేదా కారులో రోడ్డు మీద వెళుతున్నామంటే భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. ఎక్క‌డా ఏ ట్రాఫిక్ పోలీస్(Traffic Police) ఆపుతాడో అని. అన్ని స‌రిగా ఉన్నా కూడా ఏదో ఒకటి చెప్పి చ‌లానాలు విధిస్తున్నారంటూ వాహ‌నదారులు వాపోతున్నారు. కొంద‌రు చ‌లాన్లు(Challans) క‌ట్ట‌లేక బ‌స్సుల‌లో ప్ర‌యాణిస్తున్న ప‌రిస్థితి. ఈ మ‌ధ్య ట్రాఫిక్ రూల్స్ Traffic Rules మ‌రింత స్ట్రిక్ట్ కావ‌డంతో వాహ‌న‌దారుల‌లో గుబులు రేగుతుంది. అయితే సాధార‌ణంగా కొంద‌రు వాహ‌న‌దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించ‌క‌పోవ‌డంతో వారిపై చ‌లాన్ల కొర‌డా ఝుళిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Police Vehicles | ఇంత దారుణ‌మా?

అయితే ప్రజలపై చలాన్ల కొరడా ఝుళిపించే పోలీసుల్లో కొందరు ఆ నిబంధనలు తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు..తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ వాహనాలపై Police Vehicles ఇప్పటివరకు 17,391 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు కాగా, వీటికి గాను మొత్తం రూ.68.67 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీఐ(RTI) ద్వారా వెల్లడైంది. ఓ సామాన్య పౌరుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules) అన్నీ అందరికీ సమానంగా ఉండాలి అనే భావన ఉన్నప్పటికీ, కొన్ని పోలీస్ వాహనాలు సిగ్నల్ దాటడం, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు న‌మోదు కావ‌డంతో వారిపై ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు.

ప్రజలపై చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ ఉండే పోలీసులు(Police) తమపై మాత్రం మినహాయింపులు అనుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినవారంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో చట్టం ముందు అందరూ సమానమనే సూత్రాన్ని ప్రామాణికంగా పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లను(Challans) వెంటనే చెల్లించడమే కాకుండా, భవిష్యత్తులో పోలీసులు Polices కూడా ట్రాఫిక్ నిబంధనలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టి నుండి అయిన ప్రభుత్వ స్థాయి నుంచి పోలీస్ వాహనాలపై మానిటరింగ్ పెంచాలని డిమాండు చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...