అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Police | అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ (Delhi)లో 66 మంది బంగ్లాదేశీయులను (Bangladeshis) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వజీర్‌పూర్, న్యూసబ్జీమండిలో 11 కుటుంబాలకు చెందిన 66 మందిని అరెస్ట్ చేశారు. బంగ్లా వలసదారుల్లో 16 మంది మహిళలు, 30 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి చాలా మంది అక్రమ మార్గాల్లో వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిర పడుతున్నారు. ప్రముఖ నగరాల్లో తిష్ట వేస్తున్న వీరితో దేశ భద్రతకు ముంపు పొంచి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా చాలా మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారికి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు ఇచ్చే ముఠాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే అధిక జనాభా ఇబ్బంది పడుతున్న దేశానికి అక్రమ వలసదారులతో ముంపు పొంచి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అక్రమంగా నివసిస్తున్న వారిని పంపించి వేయాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఢిల్లీలో పోలీసులు అక్రమంగా నివాసం ఉంటున్న 66 మందిని అరెస్ట్ చేశారు.