అక్షరటుడే, ఆర్మూర్: Ration Rice | పట్టణం నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆర్మూర్ సీఐ సత్యనారాయణ (Armoor CI Satyanarayana) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజారాంనగర్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.
ఐచర్ వాహనంలో రేషన్ బియ్యంను తరలిస్తుండగా పెర్కిట్‌కు చెందిన డ్రైవర్ సల్మాన్‌ను పట్టుకున్నారు. అతడిని విచారించగా రాజారాంనగర్ కాలనీ చెందిన మదనం ఎల్లయ్య, సంజీవులు కలిసి రేషన్ బియ్యాన్ని (ration rice) అడవి మామిడిపల్లిలోని నాగేష్ రైస్‌మిల్లులో అప్పజెప్పాలని సూచించడంతో తాను తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ పేర్కొన్నాడు.
దీంతో వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని సివిల్ సప్లయ్స్ అధికారులకు (Civil Supply officials) సమాచారం అందించారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఐచర్ వాహన డ్రైవర్ సోహైల్, ప్రజాపంపిణీ బియ్యంను బయటకు తరలిస్తున్న మదనం ఎల్లయ్య, సంజీవ్, రైస్‌మిల్ యజమాని నాగేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.