ePaper
More
    HomeజాతీయంInstagram Reels | రీల్స్ కోసం న‌దిలోకి.. ఆరుగురు అమ్మాయిలు మృతి

    Instagram Reels | రీల్స్ కోసం న‌దిలోకి.. ఆరుగురు అమ్మాయిలు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Instagram Reels | రీల్స్ Reels పిచ్చి అనేక మంది మృత్యువుకి కార‌ణం అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆ మ‌ధ్య రైలు పట్టాలపై రీల్స్‌ చేసేందుకు ప్రయత్నించిన కుటుంబం అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తలతోపాటు వారి కుమారుడు కూడా మరణించాడు. ప్రతీ నిత్యం ఏదో ఒక న్యూస్ టిక్‌టాక్(TikTok) విషాదాల గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు టిక్ టాక్ కోసం రీల్స్ చేశారు. టిక్‌టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత.. ఆ స్థానాన్ని ఇన్‌స్టాగ్రామ్(Instagram) తీసుకుంది. ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్నారు. .

    Instagram Reels | రీల్స్ పిచ్చి

    తాజాగా, ఓ ఆరుగురు అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్ Instagram రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రా సమీపంలోని నగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో(Reels video) తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు. నది వారి ఇళ్లకు 800 మీటర్ల దూరంలోనే ఉంది.ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు. వీడియో తీసుకుంటూ ఉన్నారు. అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి నీటిలో మునిగింది. ఇది గమనించిన మిగిలిన వాళ్లు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. వారు కూడా నీటిలో మునిగిపోయారు.

    అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షిద్దామని అనుకున్నారు.వారు కూడా నీటిలో కొట్టుకుపోయారు. ఇలా ఆరుగురు అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, పోలీసులు(Police) నది దగ్గరకు చేరుకున్నారు.నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు. వారిలో నలుగురు అప్పటికే చనిపోయి ఉన్నారు. మిగిలిన ఇద్దర్నీ ఆస్పత్రి(Hospital)కి తీసుకెళ్లారు. డాక్టర్లు సీపీఆర్ చేయటంతో బతికారు. అయితే, కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు. చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం కాగా.. నవంబర్ నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డంతో కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 12 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    More like this