Homeతాజావార్తలుJubilee Hills by-election | జూబ్లీహిల్స్ బరిలో 58 మంది.. మొత్తం ఓటర్లు 4.01 లక్షల...

Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ బరిలో 58 మంది.. మొత్తం ఓటర్లు 4.01 లక్షల మంది

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల బరిలో 58 మంది నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల లెక్క (voter count) తేలింది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఇందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారని వివరించారు.

శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల (nominations) ఉపసంహరణ గడువు ముగిసిందని, మొత్తం 58 మంది పోటీలో ఉన్నారని తెలిపారు. చివరి రోజు 23 మంది ఉపసంహరించుకున్నారని వివరించారు. ఎన్నికల అధికారి కర్ణన్ (Election Officer Karnan) శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Jubilee Hills by-election | నాలుగు బ్యాలెట్‌ యూనిట్లతో పోలింగ్..

మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో నాలుగు బ్యాలెట్‌ యూనిట్లువినియోగించనున్నట్లు ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ లో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉంటాయని చెప్పారు. బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫొటో ఉంటుందని వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

పోలింగ్ స్టేషన్ (polling station) వద్ద మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లు అక్కడే తమ ఫోన్లను అప్పగించాలన్నారు. ఓటు వేసే వారు అక్కడ మొబైల్ డిపాజిట్ చేసి పోలింగ్ స్టేషన్కి వెళ్లాలని సూచించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ (voter assistant booth) ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Jubilee Hills by-election | ఓటర్‌ స్లిప్పులు పంచితే కేసు

ఓటర్లకు ఓటర్‌ స్లిప్పుల పంపిణీ బాధ్యత ఎన్నికల అధికారులదేనని ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. స్థానిక బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (local booth level officers) ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేస్తారన్నారు. రాజకీయ పార్టీల నేతలు ఓటర్‌ స్లిప్పులను పంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై (Jubilee Hills by-election) గట్టి నిఘా పెట్టామని, ముగ్గురు అబ్జర్వర్లు అన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ఇప్పటివరకు రూ.2.83 కోట్ల నగదు, 512 లీటర్ల మద్యం పట్టుకుని సీజ్ చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంపై తాము నిఘా పెట్టామన్నారు.

Must Read
Related News