అక్షరటుడే, లింగంపేట్: 55 Years Reunion | లింగంపేట మండలం (Lingampet Mandal) బాలుర ఉన్నత పాఠశాలలో 1970-71లో పదో తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా 55 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు.
55 Years Reunion | ఆప్యాయంగా పలుకరిస్తూ..
సుమారు 55 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులంతా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. బాగోగులు తెలుసుకున్నారు. ఈ రోజుల్లో తమకు విద్యనేర్పిన ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి, లింగారెడ్డి ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే మరో హెచ్ఎం సుబ్బారావు ప్రసంగాన్ని ఫోన్లో వినిపించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రతాప్‌రెడ్డి, రఘునాథ్, సుధాకర్, గురునాథ్, చంద్రశేఖర్, నరసింహారెడ్డి, సాజిద్, మనోహర్‌తో పాటు రాజ్ ప్రకాష్, పూర్వ విద్యార్థులు (Alumni) తదితరులు పాల్గొన్నారు.