అక్షరటుడే, ఇందూరు: 51st division BJP candidate | మీ కుటుంబ సభ్యుడిగా భావించి గెలిపించండి.. సేవచేస్తానని 51వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రామడుగు బాల్కిషన్ అన్నారు. ఈ మేరకు కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
51st division BJP candidate | ఆయా కాలనీల్లో కలియదిరుగుతూ..
కార్పొరేటర్‌గా గెలిపిస్తే 51వ డివిజన్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని బీజేపీ (Nizamabad BJP) కార్పొరేటర్ అభ్యర్థి రామడుగు బాల్కిషన్ అన్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఒకసారి తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తే ఆయా కాలనీల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేక చాలా కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీలలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఆయన ముందుకు కదిలారు.
మన ఇందూరు–మన మేయర్..
నిజామాబాద్ అర్బన్‌లో మన ఇందూరు మన మేయర్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రతిఒక్కరూ బీజేపీకి ఓటు వేసి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని ఆయన అన్నారు. ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (Mla Dhanpal) సహకారంతో డివిజన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.