అక్షరటుడే, వెబ్‌డెస్క్: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన కేసులో సదరు నిందితుడు మహ్మద్ ఖయ్యూమ్కు కనీవినీ ఎరుగని శిక్ష విధించింది.
నిందితుడికి ఏకంగా 51 ఏళ్ల జైలు విధించింది. అంతటితో ఆగకుండా రూ. 85 వేల జరిమానా కూడా వేసింది. దీనికితోడు బాధితురాలికి రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని సర్కారును ఆదేశించింది.
నిందితుడిపై పొక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం(SC and ST Atrocities Act), బెదిరింపులు వంటి చట్టాల కింద న్యాయమూర్తి ఇన్‌ఛార్జి జడ్జి రోజా రమణి శిక్షను ఖరారు చేశారు.
POCSO court : కేసు వివరాల ఇలా ఉన్నాయి..
2021లో బాధిత బాలిక పాఠశాల అయిపోయాక తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి బయలుదేరింది. కాగా, నిందితుడు మహ్మద్ ఖయ్యూమ్ బాధిత బాలికపై కన్నేశాడు. తన బండిపై మైనర్‌ను బలవంతంగా ఎక్కించుకున్నాడు. నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేశాడు.
ఆ తర్వాత బాలికను బెదిరించాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి చేరుకున్నాక బాలిక భయపడుతూనే తన పేరెంట్స్ కు తెలిపింది. దీంతో కుటుంబీకులు తిప్పర్తి పోలీసులను ఆశ్రయించారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు మహ్మద్ ఖయ్యూమ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. వాదోపవాదాలు విన్నాక నిందితుడికి శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువర్చారు.
POCSO court : ఏ సెక్షన్ల కింద..
పొక్సో యాక్ట్ POCSO Act సెక్షన్-6 కింద 20 సంవత్సరాలు, సెక్షన్-366(కిడ్నాప్) కింద పదేళ్లు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఇరవై ఏళ్లు, బాలికను బెదిరించినందుకు సెక్షన్-506 కింద ఏడాది.. మొత్తం 51 ఏళ్ల శిక్షను న్యాయమూర్తి ఖరారు చేశారు. దీంతోపాటు జరిమానా కూడా వేశారు.