HomeUncategorizedMadhya Pradesh | మధ్యప్రదేశ్​లో 50 వేల మంది ఘోస్ట్ ఎంప్లాయీస్..! రూ.230 కోట్ల భారీ...

Madhya Pradesh | మధ్యప్రదేశ్​లో 50 వేల మంది ఘోస్ట్ ఎంప్లాయీస్..! రూ.230 కోట్ల భారీ స్కామ్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Madhya Pradesh | మధ్యప్రదేశ్​లో భారీ స్కామ్(Huge scam) వెలుగుచూసింది. 50 వేల మంది “ఘోస్ట్ ఎంప్లాయీస్” (Ghost Employees)(దస్త్రాల్లో మాత్రమే నమోదు చేసిన పేర్లు) పేరుతో సుమారు రూ.230 కోట్ల సాలరీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 50 వేల మంది (9శాతం మంది) ఉద్యోగులకు గత ఆరు నెలలుగా (డిసెంబరు 2024 నుంచి) జీతాలు అందించడం లేదు.

ఉద్యోగుల పేర్లు, ఎంప్లాయీస్​ ఐడీ అధికారిక రికార్డుల్లో ఉన్నా.. వారికి జీతాలు మాత్రం అందకపోవడం గందరగోళానికి దారితీసింది. దీంతో వీరంతా “ఘోస్ట్ ఎంప్లాయీస్” అని, వారి పేరుతో జీతాల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. తద్వారా రూ.230 కోట్ల స్కామ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై మధ్యప్రదేశ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్(Treasury and Accounts Department) ఆరు వేల మంది డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల(డీడీవో)కు లేఖలు పంపించడం గమనార్హం.

ఈ 50 వేల మంది ఉద్యోగులు ఎవరు? వారికి జీతాలు అందకపోవడానికి కారణాలు ఏమిటీ..? సెలవుల్లో ఉన్నారా? లేక సస్పెండ్ అయ్యారా?.. లేదంటే నిజంగానే వారు ఘోస్ట్ ఎంప్లాయీసా.. తెలపాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని డీడీవో(DDO)లను ట్రెజరీ డిపార్ట్ మెంట్​ ఆదేశించింది.

వెంటనే వెరిఫికేషన్ డ్రైవ్​ను నిర్వహించి ఫేక్ ఉద్యోగులను(Fake employees) పట్టుకోవాలని మధ్యప్రదేశ్​ ఖజానాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. డీడీవోల నుంచి నివేదిక వచ్చాక ఘోస్ట్ ఎంప్లాయీస్, ఆర్థిక దుర్వినియోగంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘోస్ట ఎంప్లాయీస్​ కుంభకోణం ఆరోపణలపై మంత్రి జగదీశ్ దేవ్​గా(Minister Jagdish Devga) స్పందించారు. నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలు జరుగుతాయని చెప్పుకొచ్చారు.