ePaper
More
    HomeజాతీయంToll Pass | నాలుగు రోజుల్లో 5 లక్షల టోల్​పాస్​లు జారీ

    Toll Pass | నాలుగు రోజుల్లో 5 లక్షల టోల్​పాస్​లు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Pass | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక టోల్​పాస్లను (Toll Pass)​ అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఎన్​హెచ్​ఏఐ (NHAI) టోల్​పాస్​లను జారీ చేస్తుంది. నాన్​ కమర్షియల్​ వాహనాలకు రూ.3 వేలు చెల్లించి పాస్​ తీసుకుంటే.. ఏడాది పాటు 200 సార్లు టోల్​ గేట్ల మీదుగా ఫ్రీగా వెళ్లొచ్చు.

    టోల్​పాస్​లు అమలులోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో విక్రయాలు జరగడం గమనార్హం. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఎన్​హెచ్​ఏఐ ఏకంగా 5 లక్షల పాస్​లను జారీ చేసింది. దీంతో రూ. 150 కోట్ల ఆదాయం వచ్చింది. టోల్​పాస్​ల కొనుగోలులో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా.. కర్ణాటక, హర్యానా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ల ద్వారా అత్యధిక లావాదేవీలను నమోదు చేశాయని NHAI తెలిపింది.

    Toll Pass | రూ.3 వేలతో..

    ప్రైవేట్ వాహనాలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల్లో ప్రయాణించడానికి కేంద్రం వార్షిక టోల్​పాస్​లు తీసుకొచ్చింది. ఇప్పుడున్న ఫాస్టాగ్​ (FASTag) ద్వారానే టోల్​పాస్​ను యాక్టివేట్​ చేసుకోవచ్చు. రూ.3వేలు చెల్లించి ఈ పాస్​ పొందితే 200 ట్రిప్​లు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. దీంతో ఒక్కసారి టోల్​గేట్​ దాటడానికి సగటున రూ.15 ఛార్జీ అవుతోంది. ఎక్కువగా జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కార్లు, జీపులు వ్యాన్‌లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.

    Toll Pass | ఇలా పొందొచ్చు

    రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్, NHAI వెబ్‌సైట్‌లు, FASTag జారీచేసే పోర్టల్‌ల ద్వారా టోల్​ పాస్​లు పొందొచ్చు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్​నే టోల్​పాస్​గా యాక్టివేట్​ చేసుకోవచ్చు. దీనికోసం వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకొని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం రెండు గంటల్లోపు పాస్​ యాక్టివేట్​ అవుతుంది. దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని దాదాపు 1,150 టోల్ ప్లాజాలలో పాస్​ ద్వారా ప్రయాణం చేయొచ్చు. అయితే రాష్ట్ర రాహదారులపై మాత్రం ఇది వర్తించదు.

    Latest articles

    Nizamsagar Project | ఆరేడు గేట్ల ఎత్తివేత.. ఆసక్తిగా తిలకించిన ప్రజలు

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​(Nizamsagar Project) పరిధిలో ఆరేడు గ్రామ శివారులో సుమారు...

    Hyderabad | టీవీ, ఇంటర్​నెట్ వైర్ల తొలగింపు.. ​నిలిచిపోయిన సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఏ వీధిలో చూసినా విద్యుత్​ స్తంభాలకు కేబుల్​ వైర్లు...

    Nizamsagar Project | నిజాంసాగర్​ను టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తున్నాం : కలెక్టర్​

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా (Tourism spot) అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్​...

    Dhurandhar Movie | స్టార్ హీరో మూవీ షూటింగ్‌లో ఫుడ్ పాయిజ‌న్.. 120 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhurandhar Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన...

    More like this