అక్షరటుడే, వెబ్డెస్క్: West Bengal | ఎన్నికల కమిషన్ (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్లను తొలగించింది. ఈ మేరకు మంగళవారం ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
ఎన్నికల సంఘం బెంగాల్ (Bengal)లో ఇటీవల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టింది. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 58 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ ముసాయిదా విడుదల చేయడం గమనార్హం. ఇందులో 24 లక్షల మంది మృతి చెందినట్లు ఈసీ తెలిపింది. 19 లక్షల మంది వేరోచోట స్థిర పడ్డారని, 12 లక్షల వోటర్ల ఆచూకీ లేదని చెప్పింది. 1.3 లక్షల నకిలీ ఓట్లను తొలగించినట్లు వివరించింది.
West Bengal | వచ్చే ఏడాది ఎన్నికలు
బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగున్నాయి. ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు కొన్ని గంటల ముందు ఎన్నికల సంఘం తొలగించబడిన ఓటర్ల జాబితాను అప్లోడ్ చేసింది. అయితే ఎవరైనా ఓటర్ల పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఓటర్లు eci.gov.in, ceowestbengal.wb.gov.in/SIR,లో తమ వివరాలు చెక్ చేసుకోవాలి. లేదంటే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలి. జాబితాలో తమ పేరు లేకుంటే ఫారం 6తో దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్ గుర్తింపు కార్డు, జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్, విద్యా ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి అందించాలి.