421
అక్షరటుడే, పెద్దకొడప్గల్ : Peddakodapgal | పెద్దకొడప్గల్ మండలంలో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) జరగనున్నాయి. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది.
మండలంలో 24 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు గ్రామాల సర్పంచులు (sarpanches) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 198 వార్డు స్థానాలు ఉండగా.. 316 మంది పోటీ చేస్తున్నారు. 79 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.