అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Municipal Elections Nominations | మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) భాగంగా మొదటి రోజు బుధవారం ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అధికారులు ఆయా కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరించారు.
Municipal Elections Nominations | నిజామాబాద్ జిల్లాలో..
జిల్లావ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థలు 22 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఆర్మూర్‌లో మొత్తం ఐదు నామినేషన్లు స్వీకరించగా.. బీజేపీ, బీఆర్ఎస్ (BJP and BRS) నాయకులు చెరో ఒకటి, కాంగ్రెస్ నాయకులు రెండు, ఇండిపెండెంట్‌గా ఒక నామినేషన్ వేశారు. భీమ్‌గల్‌లో మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నాయకులు ముగ్గురు, బీఎస్పీ నుంచి ఒక నామినేషన్ వేశారు. ఇదిలా ఉండగా బోధన్‌లో ఒక్క నామినేషన్ కూడా మొదటి రోజు దాఖలు కాలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో (Nizamabad Municipal Corporation) మొత్తం 60 డివిజన్లు ఉండగా.. మొదటి రోజు 13 నామినేషన్లను వేశారు. ఇందులో బీజేపీ నుంచి 5, కాంగ్రెస్ నుంచి 4, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు నామినేషన్లను వేశారు.
Municipal Elections Nominations | కామారెడ్డిలో 22 నామినేషన్లు..
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ మందకోడిగానే సాగినట్టుగా తెలుస్తోంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కాకపోవడం కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడానికి కారణాలుగా చెప్తున్నారు. మొదటి రోజు జిల్లాలోని 92 వార్డులలో 22 నామినేషన్లు వచ్చాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) 49 వార్డులకు 14 నామినేషన్లు, బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు 3 నామినేషన్లు, బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులకు 3 నామినేషన్లు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పటికి నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో నామినేషన్లు వేయకుండానే అనేక మంది వెనుదిరిగారు.

