అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | రాష్ట్ర ప్రభుత్వం (State Govt) కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ శుక్రవారం రాత్రి జీవో విడుదల చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో కీలక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో.. ప్రత్యేక జీవో (Special G.O) ద్వారా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. జీవో నెంబరు 9ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించడం గమనార్హం. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది.
BC Reservations | రేపు ‘స్థానిక’ నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) సమావేశం నిర్వహించనుంది. CS, DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం అవుతుంది. అనంతరం సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికల సందడి మొదలు కానుంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో పలుమార్లు మంత్రులు ప్రకటించారు. రేపు ఈసీ సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.