అక్షరటుడే, హైదరాబాద్: 42 percent BC reservation | కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మొదట సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.
హైకోర్టు ఇచ్చే తుది తీర్పు ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు.
42 percent BC reservation | ఆరు గంటలపాటు భేటీ..
తెలంగాణ సచివాలయంలో సోమవారం 6 గంటల పాటు కేబినెట్ మీటింగ్ సాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో భావించినట్లు తెలిపారు. రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగిపోయిందన్నారు. ఈమేరకు తాము పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
