Anushka
Heroine Anushka | అనుష్క పోస్ట‌ర్‌తో ఏకంగా 40 యాక్సిడెంట్స్ జ‌రిగాయా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్:Heroine Anushka | టాలెంటెడ్ బ్యూటీ అనుష్క శెట్టి Anushka shetty గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో అనుష్క ఫెయిల్ అయింది.

ప్ర‌యోగాలు చేసే క్ర‌మంలో తను బాగా బరువు పెరగడం.. వెయిట్ లాస్ కావడంలో ఫెయిల్ అవడంతోనే ఆఫర్స్ తగ్గాయి. అయినా భాగమతి మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో కమర్షియల్ విజయం అందుకున్న అనుష్క ప్రస్తుతం మరోసారి క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తోంది. ‘‘ఘాఠీ’ (Ghathi) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కాని ఇంత వ‌ర‌కు రిలీజ్ కాలేదు.

Heroine Anushka | భ‌లే ప‌ని చేశావ్..

అయితే క్రిష్‌- అనుష్క కాంబోలో వేదం(Vedam Movie) అనే సినిమా వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) కూడా స్పెషల్ పోస్ట్ చేసాడు. ఇక అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సమయంలో అందరూ ఆశ్చర్యపోయే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వేదం Vedam movie సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా వాడారు.

పంజాగుట్ట సర్కిల్ లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. దీంతో ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్ల బారిన పడ్డారట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనుష్క హోర్డింగ్ వల్ల దాదాపు 40 యాక్సిడెంట్ లు అయ్యాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా ఆ హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను గుద్దేసేవారట. దీంతో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరగడంతో పోలీసులు ఇది గమనించి GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్(Anushka hoarding)ని తొలగించారట. అనుష్క అందం అలాంటిది మ‌రి.

సరిగ్గా 2005లో నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మళ్లీ అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు హీరోయిన్‌గా దూసుకుపోతూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు తిరగరాసింది. అసలు అనుష్క.. స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఒక స్టార్ హీరో రేంజ్‌లో సెలబ్రేషన్స్ జరుగుతాయి.