HomeజాతీయంMadhya Pradesh | అదృష్టం అంటే ఈ బుడ్డోడిదే.. రూ.201 కూపన్‌తో రూ.53 లక్షల లగ్జరీ...

Madhya Pradesh | అదృష్టం అంటే ఈ బుడ్డోడిదే.. రూ.201 కూపన్‌తో రూ.53 లక్షల లగ్జరీ కారు గెలిచిన నాలుగేళ్ల బాలుడు!

Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్‌లో ఓ కుటుంబానికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. గర్బా ఉత్సవాల్లో నాలుగేళ్ల మనవడి పేరుతో కేవలం రూ.201 చెల్లించి కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్‌కు రూ.53 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు బహుమతిగా వచ్చి పడింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్ జిల్లాలో నివ‌సిస్తున్న‌ ఓ సాధారణ కుటుంబానికి ఊహించ‌ని విధంగా అదృష్టం క‌లిసి వ‌చ్చింది.ఇది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం రూ.201 పెట్టుబడితో వారు ఏకంగా రూ.53 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ లగ్జరీ కారు(Toyota Fortuner Car)ను గెలుచుకున్నారు.

ఈ ఊహించని బహుమతి నాలుగేళ్ల చిన్నారి పేరుమీద లభించడమే ఈ వార్తకు మరింత ఆసక్తిని తెచ్చిపెట్టింది. బర్హాన్‌పూర్‌(Burhanpur District)లోని శిలాంపుర ప్రాంతానికి చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ ఇటీవల అభాపురిలో జరిగిన సర్కార్ ధామ్ గర్బా ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన నాలుగేళ్ల మనవడు మేధాన్ష్ పేరు మీద రూ.201 చెల్లించి ఒక లక్కీ డ్రా కూపన్‌ను కొనుగోలు చేశారు.

 Madhya Pradesh | ‘లక్కీ బాయ్’గా మారిన మేధాన్ష్

మరుసటి రోజు జరిగిన లక్కీ డ్రా(Lucky Draw)లో మేధాన్ష్ పేరు మీద కొన్న కూపన్‌కు ప్రధాన బహుమతిగా ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కారు దక్కింది. ఈ విషయం తెలియగానే రాయిక్వార్ కుటుంబం ఆనందంలో తేలిపోయింది. ఈ సందర్భంగా కిరణ్ రాయిక్వార్ స్పందిస్తూ, మా మనవడికి బొమ్మల కార్లంటే చాలా ఇష్టం. చిన్నపుడే కార్లమీద ఎక్కువ‌ మక్కువ చూపించాడు. ఇప్పుడు నిజంగా పెద్ద కారు వచ్చేసింది. కాగితాల ప్రక్రియ పూర్తయిన వెంటనే కారు మా ఇంటికి చేరనుంది. మేధాన్ష్ పుట్టినప్పటి నుంచీ అదృష్టం మా వెంట ఉంది. అందుకే ఏదైనా అతని పేరు మీదే కొంటాం” అని ఆమె పేర్కొన్నారు.

ఈ సంఘటనతో మేధాన్ష్ పేరు మారుమోగిపోతుంది. చుట్టుపక్కల వారు అతన్ని ‘లక్కీ బాయ్’ అని పిలుస్తూ కీర్తిస్తున్నారు. నాలుగు సంవత్సరాల వయసులోనే ఇలా లక్షల్లో విలువైన బహుమతి గెలుచుకోవడం అరుదైన విషయమే. మధ్యప్రదేశ్‌లో లాటరీలపై అధికారికంగా నిషేధం ఉన్నా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్లో నిర్వహించే లక్కీ డ్రాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే ఈ గర్బా ఉత్సవంలో జరిగిన లక్కీ డ్రా నిబంధనలకు విరుద్ధంగానే జ‌రిగింద‌ని అంటున్నారు.