అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Police | జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై (Minor driving) సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో (nizamabad Commissionerate)మైనర్లు వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
వారం రోజులుగా మైనర్ డ్రైవింగ్ చేస్తూ 36 మంది పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సీపీ ఆదేశాల మేరకు వారితో నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్లకార్డులతో ప్రచారం చేయించారు. మైనర్ డ్రైవింగ్ చేయవద్దంటూ ఫ్లకార్డులు పట్టుకుని నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద నిలబడ్డారు. వేగం మోజులో పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని సూచిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.