అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists Surrender | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఎన్కౌంటర్లలో అనేక మంది హతం అవుతుండగా.. తాజాగా తెలంగాణలో 35 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.
మావోయిస్టు పార్టీ బలహీనంగా మారింది. ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో బలగాలు అడవుల్లోకి చొచ్చుకు వస్తుండగా.. వారిని ఎదుర్కోలేక మావోలు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. కీలక నేతలు సైతం నేలకొరుగుతున్నారు. దీంతో పలువురు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు (Telangana Police) ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దీంతో 35 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి ముందుకు వచ్చారు. ఇందులో హిడ్మా బెటాలియన్ కమాండర్స్, కేఎండీసీ కమాండర్ ఎర్రోళ్ల రవి అలియాస్ ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ మావోల లొంగుబాటుపై వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
Maoists Surrender | ఆ ఘటన తర్వాత..
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడ్మిల్లి ఎన్కౌంటర్ (Maredumilli Encounter)లో మావోయిస్ట్ కీలక నేత మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజే, టెక్ శంకర్ సహా పలువురు మృతి చెందారు. అంతకు ముందు పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal), ఆశన్న తమ అనుచరులతో లొంగిపోయారు. ఈ ఘటన తర్వాత చాలా మంది నక్సల్స్ ఆయుధాలు వీడుతున్నారు. అడవిని వీడి జనంబాట పడుతున్నారు. ఆయా రాష్ట్రాల పోలీసులు సైతం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఇటీవల తెలంగాణలో పలువురు మావోలు సరెండర్ అయ్యారు. తాగాజా మరో 35 మంది లొంగిపోయినట్లు తెలుస్తోంది.