అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: 34th Division BRS Candidate | అవకాశమిచ్చి గెలిపిస్తే డివిజన్‌ను అభివృద్ధి చేస్తానని 34వ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిని నీతా అర్జున్ రాథోడ్ (Neeta Arjun Rathod) అన్నారు. ఈ మేరకు కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
34th Division BRS Candidate | మెజారిటీతో గెలిపించాలి..
ఈ సందర్భంగా ఆమె కాలనీలో పర్యటిస్తూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో నగరంలో (Nizamabad corporation) జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరిస్తూ అదే స్పూర్తితో డివిజన్‌ను సైతం అభివృద్ధి చేస్తానని ఆమె మాటిచ్చారు. ప్రభుత్వ పథకాల (Government schemes) అమలులో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.
పోరాడైన నిధులు సాధిస్తాం..
డివిజన్‌కు రావాల్సిన నిధులతో పాటు అదనపు నిధులను కోసం కూడా పోరాడుతానన్నారు. మాలిక సదుపాయాల కల్పనలో ముందుంటామని ఆమె హామీ ఇచ్చారు. తమను నమ్మి ఒక్కసారి కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.