Ration Rice
Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి(Gandhari) మండలంలోని గౌరారం (Gouraram) గ్రామం నుంచి రేషన్​ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేశారు. బొలెరో వాహనంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 32 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కోటగిరి గ్రామానికి చెందిన బొలెరో వాహనం నడుపుతున్న మహమ్మద్ ఉమర్​ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇక్కడ రేషన్​బియ్యాన్ని కొని.. ఇతర రాష్ట్రాలకు తరలించే వ్యాపారం చేస్తున్న తాడ్కోల్​ గ్రామానికి చెందిన అందె మనోహర్​ను సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం రేషన్​ బియ్యంను సివిల్ ​సప్లయ్​ అధికారులకు(Civil Supply department) అప్పగిస్తామని వివరించారు.