అక్షరటుడే, వెబ్‌డెస్క్: Union Minister Jitendra | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణతో సహా వ్యక్తిగత కారణాల వల్ల 30 రోజుల వరకు సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra) గురువారం రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.
సభ్యులు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రస్తుత సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సిబ్బంది వృద్ధాప్య తల్లిదండ్రుల (Aging Parents) సంరక్షణతో సహా ఏదైనా వ్యక్తిగత కారణం కోసం ప్రతి సంవత్సరం 30 రోజుల వరకు ఎర్నింగ్ లీవ్స్ తీసుకోవచ్చన్నారు.
సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల సెలవులు లభిస్తాయి. వీటిని వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ వంటి వ్యక్తిగత కారణాల కోసం ఉపయోగించవచ్చు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (Central Civil Services) నియమాలు, 1972 ప్రకారం ఉద్యోగులు ఏటా వివిధ రకాల సెలవులను పొందేందుకు అనుమతిస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో 30 రోజుల సంపాదిత సెలవు, 20 రోజుల సగం వేతన సెలవు, 8 రోజుల క్యాజువల్, 2 రోజుల పరిమిత సెలవులు ఉన్నాయి. ఈ సెలవులన్నింటినీ వ్యక్తిగత కారణాల కోసం ఉపయోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
“సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నిబంధనలు, 1972 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (Central Government Employee)కి ఇతర అర్హత గల సెలవులతో పాటు సంవత్సరానికి 30 రోజుల సంపాదన సెలవులు, 20 రోజుల హాఫ్ పే సెలవులు, ఎనిమిది రోజుల క్యాజువల్ లీవులు, రెండు రోజుల పరిమిత సెలవులు లభిస్తాయి, వీటిని వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల పొందవచ్చు” అని సింగ్ వివరించారు. సర్వీస్ నియమాలలో భాగంగా ఎర్నింగ్ లీవ్స్ (Earning Leaves), హాఫ్-డే లీవ్, సిక్ లీవ్, కమ్యూటెడ్ లీవ్, అసాధారణ సెలవు, ప్రసూతి సెలవు, పితృత్వ సెలవు, పిల్లల సంరక్షణ సెలవు, అధ్యయన సెలవు, ప్రత్యేక వైకల్య సెలవు డిపార్ట్‌మెంటల్ సెలవు వంటి వివిధ రకాల సెలవులు ఉన్నాయి.
Union Minister Jitendra | ఉద్యోగుల భర్తీ నిరంతర ప్రక్రియ
ఖాళీలను బట్టి ఉద్యోగాలు భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని మంత్రి తెలిపారు. రాజ్యసభ (Rajya Sabha)కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ విభాగాలలో ఖాళీలు ఏర్పడటం, భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. 2021 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు (Ministries), విభాగాలలో మంజూరు చేయబడిన మొత్తం పోస్టుల సంఖ్య 40,35,203 అని వివరించారు. ప్రభుత్వ విభాగాలలో ముఖ్యంగా రైల్వేలు, రక్షణ, హోం వ్యవహారాలు, పోస్టల్ శాఖలో మొత్తం మంజూరు చేయబడిన పోస్టులు, ఖాళీల వివరాలను కోరుతూ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు.