- Advertisement -
Homeతాజావార్తలుTyphoid | ఆసుపత్రులకు టైఫాయిడ్ బాధితుల క్యూ.. ఇలా చేస్తే బయటపడొచ్చు..

Typhoid | ఆసుపత్రులకు టైఫాయిడ్ బాధితుల క్యూ.. ఇలా చేస్తే బయటపడొచ్చు..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Typhoid | టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. ఇది సాల్మోనెల్లా టైఫీ (Salmonella typhi) అనే బాక్టీరియా వల్ల వస్తుంది. సాధారణంగా కలుషితమైనా ఆహారం,నీరు లేదా అపరిశుభ్రమైనా వాతావరణం ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.టైఫాయిడ్ (Typhoid) వ్యాధికి సరైనా సమయంలో చికిత్స తీసుకోనట్లయితే అది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.

Typhoid | టైఫాయిడ్ రావడానికి గల కారణాలు:

  • కలుషితమైనా ఆహారం, నీరు:బ్యాక్టీరియా ఉన్న అపరిశుభ్రమైనా నీటిని తాగడం లేదా కలుషితమైనా ఆహారం తినడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది.
  • వ్యక్తిగత పరిశుభ్రత లోపం:మరగుదొడ్డి వాడిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందవచ్చు.
  • కలుషిత వాతావరణం: వ్యాధి సోకిన వ్యక్తి మలం లేదా మూత్రంలో ఉన్న బ్యాక్టీరియా నీటి వనరులను లేదా ఆహారాన్ని కలుషితం చేస్తుంది.
  • ఒకరినుండి మరొకరికి: టైఫాయిడ్ వ్యాధిగ్రస్తుల నుండి కుటుంబంలోని వేరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.

Typhoid | లక్షణాలు

టైఫాయిడ్ (Typhoid) సాధారణంగా కొన్ని రోజుల పాటు వివిధ రకాల లక్షణాలను చూపుతుంది. జ్వరం 103-104 F వరకు అధికంగా ఉంటుంది. కీళ్ళనొప్పులు. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, డయేరియా  (Diarrhea) లేదా తీవ్రమైన మలబద్ధకం (constipation), ఆకలి తగ్గిపోవడం, వికారం, వాంతులు లాంటివి ఉంటాయి. కొన్నిసార్లు ఛాతీపై లేదా పొట్టపై గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయి. టైఫాయిడ్ తీవ్రతరం అయినప్పుడు రోగి తీవ్రమైనా అలసట, బలహీనతకు గురవుతాడు.

- Advertisement -

Typhoid | పరిష్కారాలు, నివారణ మార్గాలు

టైఫాయిడ్‌కు సరైనా చికిత్స డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సును (antibiotics Course) పూర్తి చేయడం ద్వారా లభిస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి, చికిత్స ప్రారంభించడం మంచిది. కోలుకోవడానికి తగినంతా విశ్రాంతి తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచుగా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, సూప్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. శుభ్రమైనా, సురక్షితమైనా నీటిని అనగా కాచి చల్లార్చిన నీటినే తాగాలి. ఆహారం వండటానికి ముందు, తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయటి ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. వ్యాధి సంక్రమించిన రోగికి దూరంగా ఉండాలి. అవసరమైతే వైద్యుడి సలహా మేరకు టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. పరిశుభ్రతలతో టైఫాయిడ్‌ను నివారించవచ్చు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News