Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 2కే వాక్

Nizamabad City | మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 2కే వాక్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | వరల్డ్ హార్ట్ డే (World Heart Day) సందర్భంగా నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 2కే వాక్​ నిర్వహించనున్నారు.

ఈ మేరకు శనివారం ఆస్పత్రి వైద్యులు సదానంద రెడ్డి, సందీప్ రావు, రవికిరణ్, జగదీష్ చంద్రబోస్, వరిస్ అలీ వివరాలు వెల్లడించారు. నగరంలో 2కే వాక్​ను రుక్మిణి ఛాంబర్స్​ వినాయక్ నగర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా అదనపు డీసీపీ బస్వారెడ్డి హాజరుకానున్నట్లు వివరించారు.

Nizamabad City | గండె జబ్బులు క్రమంగా పెరుగుతున్నాయ్​..

నేటి సమాజంలో గుండె జబ్బులు క్రమక్రమంగా పెరుగుతున్నాయని మెడికవర్​ ఆస్పత్రి (Medicover Hospital) వైద్యులు పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల ఆహారం, ఆరోగ్య పరీక్షల ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు. ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడికవర్​ ఆస్పత్రి తరపున ప్రజలందరు ఈ 2కే వాక్​లో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

Nizamabad City | రూ.999కే కార్డియాలజీ ప్యాక్​..

మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో సాధారణంగా రూ.5,000 విలువైన కార్డియాలజీ ప్యాకేజీని కేవలం రూ.999కే అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఈ ప్యాకేజీని తప్పక వినియోగించుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేశారు.

Must Read
Related News