అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Hypertension Day | మెడికవర్ ఆస్పత్రి (Medicover Hospital) ఆధ్వర్యంలో శనివారం నగరంలో 2కే రన్ (2K Run) నిర్వహించనున్నట్లు ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్ సందీప్ రావు (Cardiologist Dr. Sandeep Rao) తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే (బీపీ దినోత్సవం)ను సందర్భంగా ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రన్ మెడికవర్ ఆస్పత్రి నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఉంటుందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
