అక్షరటుడే, మెండోరా: National Unity Day | సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (Sardar Vallabhbhai Patel) సందర్భంగా..రాష్ట్రీయ ఏక్తా దివస్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 2కే రన్‌ను (2k Run) విజయవంతంగా నిర్వహించారు. ఆయా మండలాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
National Unity Day | ఆర్మూర్‌లో..
అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పోలీస్ శాఖ (Armoor Police) ఆధ్వర్యంలో శుక్రవారం ఏక్తా దివస్ సందర్భంగా పట్టణంలో 2కే రన్ నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్సై సత్యనారాయణ గౌడ్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
National Unity Day | పోచంపాడ్ గ్రామంలో..
అక్షరటుడే, మెండోరా: మెండోరా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోచంపాడ్ గ్రామంలో 2K రన్ నిర్వహించారు. సుమారు 150 మంది రన్నర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ ఏకతా, ఐకమత్యం కోసం ఈ రన్‌ను నిర్వహించామని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ప్రజల్లో దేశభక్తి, ఏకతా భావాలు మరింత బలపడేలా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.
National Unity Day | ఇందల్వాయిలో..
అక్షరటుడే, ఇందల్వాయి: మండల కేంద్రంలో 2కే రన్‌ను సీఐ వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశ సమైక్యతకు పాటుపడి 530కి పైగా సంస్థానాలను విలీనం చేసిన ఉక్కుమనిషి పటేల్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి ఎస్సై సందీప్, సిబ్బందితో పాటు, వివిధ గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.
National Unity Day | కమ్మర్‌పల్లిలో..
అక్షరటుడే, కమ్మర్పల్లి: కమ్మర్ పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఏఎస్సై వెంకట కుమార్, పోలీస్ సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ నాగభూషణం, పాఠశాల విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్సై వెంకట్ కుమార్ మాట్లాడుతూ పటేల్ దేశ ఐక్యతకు చేసిన సేవలు మరువలేనివన్నారు.

 
 

