అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : World Lupus Day | ప్రపంచ లూపస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించినట్లు ఎండీ, రుమటాలజీ గోల్డ్ మెడలిస్ట్, అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గ్రీష్మ(Allergy Super Specialist Dr. Greeshma) అన్నారు. ఐఎంఏ నిజామాబాద్, రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ లూపస్ దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలో ర్యాలీ చేపట్టారు.
స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి రుమటాలజీ, ఆర్థరైటిస్ సెంటర్ వరకు ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ(IMA Awareness Rally) నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. లూపస్ వ్యాధి(Lupus Disease) శరీరంలోని కళ్లు, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్త నాశాలు ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుందన్నారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి బారినపడిన వారిలో జుట్టు ఎక్కువగా రాలడం, ఎండలో వెళ్లినప్పును చెంపలపై దద్దుర్లు రావడం జరుగుతుందన్నారు. కారణం లేకుండా జ్వరం రావడం, కీళ్లు, తలనొప్పి, వంటి లక్షణాలుంటాయని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు రుమటాలజి వైద్యులను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు రవికిరణ్, జీవన్ రావు, శ్రీశైలం, పీబీ కృష్ణ్ణమూర్తి, దామోదర్ రావు, ద్వారకానాథ్, గాంధీ, తదితరులు పాల్గొన్నారు.