అక్షరటుడే, కోటగిరి: Kotagiri | పంచాయతీ ఎన్నికలకు (panchayat elections) సంబంధించి గురువారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కోటగిరి, పోతంగల్ మండలాల్లో నామినేషన్లు స్వీకరించారు.
పోతంగల్ మండలంలో గురువారం సర్పంచ్ పదవులకు 14 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో చందర్ (Pothangal mandal) తెలిపారు. సుంకిని 5, జల్లాపల్లి ఫారం 2, సోంపూర్, కొల్లూర్, చేతన్ నగర్, భాకరఫారం, జల్లాపల్లి, కల్లూర్, పోతంగల్లలో ఒక్కోటి చొప్పున నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. కోటగిరి మండలంలోని సర్పంచ్ 13, వార్డు సభ్యులకు సంబంధించి 14 నామినేషన్లు వచ్చాయని కోటగిరి ఎంపీడీవో విష్ణు తెలిపారు.
