అక్షరటుడే, ఇందూరు: 26th division corporator | మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 26వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బంటు రామును స్థానిక ప్రజలు సన్మానించారు. సూర్యనగర్కు చెందిన కాలనీ ప్రజలు గురువారం ఆయనకు సన్మానం చేశారు. అనంతరం అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బంటు రాము మాట్లాడుతూ 26వ డివిజన్ (26th division corporator) అభివృద్ధి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాలనీ వాసులు బంటు మహేశ్, సీహెచ్ భరత్, ఎం.శ్రీనివాస్, నల్ల రాకేశ్, ఆదం మధు, టి.మధు, జంగిటి సాయిరాం, ఆదం గణేశ్, పూదరి గంగాకిరణ్, క్యాసర్ల సురేశ్, అర్వింద్ స్వామి, యెర్గం సందీప్, జంగిటి నరేశ్, అయితి శశాంక్, మీసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.