ePaper
More
    Homeఅంతర్జాతీయంNarendra Modi | భారత్​లో 2,500 రాజకీయ పార్టీలు.. మోదీ మాటలతో ఘనా పార్లమెంట్​ షాక్​

    Narendra Modi | భారత్​లో 2,500 రాజకీయ పార్టీలు.. మోదీ మాటలతో ఘనా పార్లమెంట్​ షాక్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Narendra Modi : భారత్‌ మరింత బలంగా ఉంటే సంపన్నమైన ప్రపంచానికి పాటుపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi వ్యాఖ్యానించారు. ఘానా పర్యటనలో ఉన్న మోదీ.. అక్కడి పార్లమెంట్​లో ప్రసంగించారు.

    తమ దేశం(భారత్‌)లో 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తే.. పార్లమెంట్‌ సభ్యులు షాక్​ అయ్యారు. నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలను ఏకం చేస్తుందని ప్రధాని అన్నారు. మానవ హక్కులకు అండగా ఉంటుందన్నారు.

    ‘ప్రజాస్వామ్యం మా ప్రాథమిక విలువల్లో భాగం. మా దేశంలోని వివిధ రాష్ట్రాలను 20కి పైగా విభిన్న పార్టీలు పాలిస్తున్నాయి. వేలాది మాండలికాలు, 22 అధికారిక భాషలు ఉన్నాయి. మా దేశానికి(భారత్​) వచ్చిన వారందరినీ ప్రజలు ఆత్మీయంగా స్వాగతించడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈ స్ఫూర్తి కలిగి ఉన్నందునే ఇండియన్స్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తేలికగా కలిసిపోతారు’ అని మోడీ చెప్పుకొచ్చారు.

    Narendra Modi : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం..

    ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌.. ప్రపంచానికి స్ట్రాంగ్ పిల్లర్​లాంటిదని మోదీ అన్నారు. ప్రపంచ పాలనలో విశ్వసనీయమైన, ప్రభావవంతమైన సంస్కరణలు రావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బలమైన రాజకీయ వ్యవస్థ, సుపరిపాలన వల్ల భారత్‌ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Narendra Modi : ది ఆఫీసర్​ ఆఫ్​ ది ఆర్డర్​ ఆఫ్​ ది స్టార్​ ఆఫ్​ ఘనా..

    ప్రధాని నరేంద్ర మోదీని ఘనా దేశం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా'(Officer of the Order of the Star of Ghana) పురస్కారంతో సత్కరించింది. ఘనా రాజధాని ఆక్రాలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ President John Dramani, ప్రధాని మోదీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు.

    ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ పురస్కారం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ప్రధాని మోదీ ఘనా తర్వాత గురువారం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు వెళ్తున్నారు. తదుపరి అక్కడి నుంచి అర్జెంటీనా Argentina, బ్రెజిల్ Brazil, నమీబియా Namibia లో పర్యటిస్తారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...