Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | మహిళ కడుపులో 250 రాళ్లు..షాక్​లో వైద్యులు..

Kamareddy | మహిళ కడుపులో 250 రాళ్లు..షాక్​లో వైద్యులు..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కిడ్నీలో రాళ్లున్నాయంటే.. మూడో.. నాలుగో ఉంటాయనుకుంటాం.. కొంతమందికి పది వరకు రాళ్లు ఉండే అవకాశాలుంటాయి. అయితే దీనికి విరుధ్ధంగా ఓ వృద్ధురాలి కిడ్నీలో ఏకంగా 250 వరకు రాళ్లు (Kidney stones)ఉండడంతో వైద్యులే ఒకింత షాక్​కు గురయ్యారు..

Kamareddy | తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో వృద్ధురాలు..

వివరాల్లోకి వెళ్తే తాడ్వాయి(Tadwai) మండలం కృష్ణాజివాడి(Krishnajiwadi) గ్రామానికి చెందిన దత్తుబాయి అనే 60 ఏళ్ల మహిళ సుమారు నెల రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా ఆమె నొప్పి తగ్గలేదు. నొప్పి భరించలేని దత్తుబాయి మంగళవారం ఉదయం కామారెడ్డి (kamareddy) పట్టణంలోని మాతృశ్రీ ఆస్పత్రికి (Matrushri Hospital) వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యురాలు పిత్తాశయం (గాల్ బ్లాడర్)లో రాళ్లు ఉన్నాయని నిర్ధారించారు. ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (Laparoscopic surgeon) నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆపరేషన్ చేశారు.

Kamareddy | ఆపరేషన్​ చేసే క్రమంలో విస్తుపోయేలా..

స్కానింగ్ రిపోర్ట్ (Scaning Report) ప్రకారం ఆరు రాళ్లు అనుకున్న వైద్యులకు ఆపరేషన్ చేసిన సమయంలో రాళ్లు బయటకు వస్తూనే ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపరేషన్ తర్వాత రాళ్లను లెక్కించగా 20 వరకు పెద్ద సైజ్ రాళ్లు, మిగతా చిన్న రాళ్లు కలిపి 250కి పైగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ సందర్భంగా వైద్యురాలు డా.శ్రావణిక మాట్లాడుతూ.. వైద్యశాఖ చరిత్రలో తాను ఇప్పటివరకు ఇలాంటి ఆపరేషన్ చేయలేదన్నారు. దత్తుబాయి వయసు రీత్యా అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఆపరేషన్​ చేశామన్నారు. ఆమె ఆరోగ్యం సహకరిస్తుందని ధ్రువీకరించుకున్నాకే ఆపరేషన్ చేయడానికి నిర్ణయించామన్నారు. ప్రస్తుతం పేషంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.