Gold Seized
Gold Seized | ఎయిర్​పోర్టులో 25 కిలోల బంగారం పట్టివేత.. దంపతుల అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Seized | గుజరాత్​లోని సూరత్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో (International Airport) కస్టమ్స్​ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. అక్రమంగా పసిడిని పేస్ట్​ రూపంలో తీసుకు వస్తున్న దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25.57 కోట్ల విలువైన 24.8 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Gold Seized | పేస్ట్​గా మార్చి..

బంగారం స్మగ్లింగ్ ​(Gold Smuggling) చేయడానికి అక్రమార్కులు కొత్త కొత్త దారులు వెతుకున్నారు. బంగారాన్ని పేస్ట్​ (Gold Paste) రూపంలో మార్చి అక్రమంగా తీసుకు వస్తున్నారు. తాజాగా దుబాయి నుంచి వచ్చిన దంపతులు పసిడిని పేస్ట్​గా మార్చిలో దుస్తులు, షూలలో పెట్టుకొని వచ్చారు. అయితే వారి తీరుపై అనుమానం రావడంతో కస్టమ్స్​ అధికారులు (Customs officers) తనిఖీలు చేపట్టారు. దీంతో 24.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జులై 20న నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో కోసాద్ అమ్రోలిలోని సంస్కార్ రెసిడెన్సీ (Amroli Sanskar Residency) ప్రాంతానికి చెందిన దంపతులను అరెస్ట్​ చేశారు. ప్యాంటు, ఇన్నర్‌వేర్, హ్యాండ్‌బ్యాగులు, షూలలో దాచిన బంగారాన్ని సీజ్​ చేశారు.