అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijayawada | అధికారులు విజయవాడలో భారీగా గంజాయి పట్టుకున్నారు. డీఆర్‌ఐ (DRI) అధికారులు 248 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశా నుంచి యూపీ తరలించేందుకు దానిని విజయవాడలో ఉంచినట్లు గుర్తించారు.
కానూరు వద్ద డీఆర్‌ఐ అధికారులు ఏపీ ఈగల్ టీమ్ (Eagle Team)తో కలిసి నిర్వహించిన దాడిలో భారీగా గంజాయి దొరికింది. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంజాయిని ఒడిశా (Odisha) నుంచి విజయవాడకు తీసుకు వచ్చిన నిందితులు కానూరు వద్ద నిల్వ ఉంచారు.
విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. గంజాయిని యూపీకి తరలించేందుకు వాహనంలోకి ఎక్కిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి విలువ రూ.49.76లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీరు విజయవాడ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
