అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకన్ డ్రైవ్‌పై పోలీస్ శాఖ (police department) ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.
Kamareddy SP | జిల్లావ్యాప్తంగా 242 కేసులు నమోదు..
జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాలతో ఎక్కడికక్కడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నూతన సంవత్సర వేళ మందుబాబులు మద్యం తాగి సంబరాలు చేసుకున్నారు. కాగా.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
Kamareddy SP | కామారెడ్డి డివిజన్లో..
కామారెడ్డి డివిజన్ పరిధిలో 117 కేసులు, ఎల్లారెడ్డి డివిజన్ (Yellareddy division) పరిధిలో 55 కేసులు, బాన్సువాడ డివిజన్ పరిధిలో 75 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను సైతం సీజ్ చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడపడం ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల ప్రాణాలు, ఇతర వ్యక్తుల కుటుంబ సభ్యుల జీవితం ప్రమాదంలో పడుతుందన్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వాహనం నడపాలని సూచించారు.