HomeతెలంగాణDrunk drive| డ్రంకన్​ డ్రైవ్​ కేసులో 24 మందికి జైలు

Drunk drive| డ్రంకన్​ డ్రైవ్​ కేసులో 24 మందికి జైలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Drunk drive| డ్రంకన్​ డ్రైవ్​ కేసులో 24 మందికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సీపీ ఆదేశాల మేరకు డివిజన్​ పరిధిలోని అన్ని పోలీస్​స్టేషన్లలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 46 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించి వారికి కౌన్సెలింగ్​ నిర్వహించారు. అనంతరం వారిని మార్నింగ్​ కోర్టులో హాజరుపర్చారు. సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ నూర్జహాన్​ 24 మందికి జైలు శిక్ష విధించారు. 22 మందికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఏసీపీ తెలిపారు.