అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Police Prajavani | జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో 24 ఫిర్యాదులు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు.
Police Prajavani | నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..
పోలీస్ ప్రజావాణిలో ప్రజలు నిర్భయంగా తమ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చని సీపీ తెలిపారు. ఆ అర్జీలను చట్టపరంగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ప్రజలు లిక్కర్, అధిక మొత్తంలో డబ్బులు తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.