అక్షరటుడే, వెబ్డెస్క్: Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 270 మంది మృతి చెందారు.
విమానం కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మృతదేహాలు గుర్తించలేదని స్థితిలో ఉన్నాయి. దీంతో మృతుల కుటుంబాలకు డీఎన్ఏ టెస్ట్(DNA Test) చేసి మృతదేహాలు అప్పగిస్తున్నారు. ప్రమాదం జరిగి వారం రోజులు దాటినా.. ఇంకా మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 210 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిల్లో 187 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతి చెందారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనంపై కూలడంలో అందులోని 29 మంది చనిపోయారు.