అక్షరటుడే, తిరుమల: Lord Venkateswara darshan : తిరుమల(TIRUMALA)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 25 కంపార్టుమెంట్ల(compartments)లో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆగస్టు 19, సోమవారం) వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara)ని 80,502 మంది భక్తులు దర్శించుకున్నారు.
31,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.88 కోట్ల హుండీ ఆదాయం (hundi income) వచ్చింది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.