అక్షరటుడే, ఇందూరు: Panchayat Elections | గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ డివిజన్లో (Nizamabad Division) ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 8 మండలాల్లో ఓటర్లు ఉదయంనుంచే క్యూలైన్లలో నిలబడ్డారు. విపరీతమైన చలి ఉన్నప్పటికీ ఉత్సాహంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) 20.49 శాతం ఓట్లు పోలయ్యాయి.
Panchayat Elections | 48,929 మంది..
ఉదయం 9 గంటల వరకు ధర్పల్లిలో మండలంలో 20.99, డిచ్పల్లిలో 13.52శాతం, ఇందల్వాయిలో 19.95శాతం, జక్రాన్పల్లిలో 23 శాతం, మాట్లూరులో 22.31 శాతం, మోపాల్ మండలంలో 19.43 శాతం, నిజామాబాద్ రూరల్ లో 26.69 శాతం, సిరికొండ మండలంలో 23.24 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2,38,838 ఓట్లకు గాను.. ఇప్పటివరకు 48,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోపాల్ మండలం సిర్పూర్లో ఉదయం 11గంటల సమయానికి 40శాతం పోలింగ్ నమోదైందని అధికారులు పేర్కొన్నారు.
Panchayat Elections | పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) పరిశీలించారు. మోపాల్(Mopal), ముల్లంగి, ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎన్నికల పరిశీలకులు శ్యాం ప్రసాద్ లాల్ సైతం మాట్లూర్, గుండారం తదితర కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

