Homeతాజావార్తలుHanmakonda | పొలాల్లో 2 వేల నాటుకోళ్లు.. ఎగబడి పట్టుకెళ్లిన జనం

Hanmakonda | పొలాల్లో 2 వేల నాటుకోళ్లు.. ఎగబడి పట్టుకెళ్లిన జనం

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రోడ్డు పక్కన పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను వదిలి వెళ్లారు. దీంతో స్థానికులు వాటిని పట్టుకెళ్లారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanmakonda | హన్మకొండ (Hanmakonda) జిల్లా ఎల్కతుర్తిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పొలాల్లో రెండు వేల వరకు నాటు కోళ్లు ఉండటంతో ప్రజలు ఎగబడి పట్టుకెళ్లారు. అయితే ఆ కోళ్లు ఎలా వచ్చాయనేది మాత్రం తెలియడం లేదు.

నాటుకోళ్లకు ఉన్న డిమాండ్​ తెలిసిందే. నాటు కోడి (Natu Kodi) కూర పేరు చెప్పగానే చాలా మందికి నోరూరుతుంది. మార్కెట్​లో వీటి రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిలో ఎల్కతుర్తి (Elkathurthi) సమీపంలో రెండు వేల వరకు నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో భారీగా అక్కడకు చేరుకున్నారు. పొలాల్లో కోళ్లను పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. కొంతమంది పదుల కొద్ది కోళ్లను పట్టుకొని ఇంటికి వెళ్లారు. మరికొందరికి ఒకటి, రెండు కోళ్లు దొరికాయి.

Hanmakonda | ఎవరు వదిలారో..

నాటుకోళ్లకు మార్కెట్​లో మస్త్​ డిమాండ్​ ఉంటుంది. అయినా కానీ ఇన్ని కోళ్లను ఎవరు ఇక్కడ వదిలి వెళ్లారో తెలియడం లేదు. కోళ్లను ఎందుకు వదిలి పెట్టారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. కోళ్లకు ఏదైనా వ్యాధి సోకడంతో వదిలేశారా.. లేక కోళ్లను తీసుకు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైందా అన్న విషయాలు తెలియడం లేదు. ఏది ఏమైనా.. ఫ్రీగా కోళ్లు దొరికే సరికి ప్రజలు ఎగబడి తెచ్చుకున్నారు.

Must Read
Related News